తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తన ఉదారతను చాటుకున్నారు. నగరంలోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ కాలనీ నివాసుతులైన సందనపల్లి ఉప్పలయ్య,పారిజాతం దంపతులకు అఖిల్,శివశరన్ లు గత ఐదేండ్లుగా మస్కల్ డి స్ట్రోపి అనే వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ బొంతు రామ్మోహాన్ సతీమణి బొంతు శ్రీదేవి మేయరు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మేయర్ రామ్మోహాన్ స్వయంగా తక్షణ సహాయంగా పవర్ వీల్ చైర్లను ఈ రోజు నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీలోకేశ్ కుమార్ గారితో కల్సి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబం మేయర్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
