తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని మురికివాడల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో దవాఖానలకు చేర్చే ప్రస్తుత 108 అంబులెన్సుల మాదిరిగానే తక్షణ సేవలకోసం టువీలర్ 108 అందుబాటులోకి తీసుకు రానున్నది. ఫస్ట్రెస్పాండర్ అంబులెన్సు పేరిట నగరంలో ద్విచక్రవాహన అంబులెన్సు సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుత అంబులెన్సులు వెళ్లలేని వాడలకు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో వేగంగా ప్రమాదస్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించేందుకు ఈ బైక్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 108 బైక్‌లను 50 సిద్ధం చేశారు. ఈ వాహనాలను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నది. ప్రథమ చికిత్స, వైద్య నైపుణ్యాలు కలిగిన వ్యక్తిని ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు ఉద్యోగిగా నియమించి 108 సేవలకు వినియోగించనున్నారు. రూ.లక్ష ఖర్చుతో ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు వాహనం, మెడికల్ కిట్‌ను ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో మొత్తం 50 వాహనాలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు నిర్వహణకు ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేల వరకు ఖర్చు చేయనున్నారు.
First Responder Two wheeler Ambulance to provide quick first-aid to victims. Another excellent initiative of Health dept of Telangana pic.twitter.com/pqNcIgGtJ3
— KTR (@KTRTRS) October 24, 2017