దేశం కాని దేశంలో ఉపాధి కోసం యజమాని నమ్మించి మోసం చేస్తే…మంత్రి కేటీఆర్ ఆదుకున్నాడు. కువైట్లో ఉపాధి కోసం వెళ్లగా…వారి యజమాని నుంచి గత తొమ్మిది నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుండగా మంత్రి ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మగ్గిడి రాజశేఖర్, భీంగల్ మండలానికి చెందిన నీలం గంగాదర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని హనుమాన్ గల్లీకి చెందిన కందుల సాయికుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అయితే….సరైన భోజనం కూడా పెట్టకుండా వేధిస్తుండటంతో పాటుగా కరెంటు పని కల్పిస్తామని చెప్పి వ్యవసాయ కార్మికుడిగా పని చేయమని ఒత్తిడి చేసిన నేపథ్యంలో వారి భవిష్యత్, ఇతర సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్మికుల ఇబ్బంది తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ఆదేశాలనుసారం…రాష్ట్ర ఎన్నారై విభాగం స్పందించింది. కువైట్లోని భారత రాయభార కార్యాలయ వర్గాలతో, సామాజిక కార్యకర్త గంగుల మురళీధర్ రెడ్డితో సమన్వయం చేసుకొని వారి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు సాగింది. తెలంగాణ ప్రభుత్వం స్పందనతో కువైట్లోని భారత రాయభార కార్యాలయంలో యజమాని, పోలీసులతో, ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించింది. తదుపరి వారిని కారాగారం నుంచి విముక్తి చేసింది. ఈ కార్మికులు నేడు(శనివారం) స్వగృహానికి చేరుకోనున్నారు.
Post Views: 429