ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక వృద్ధురాలు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పక్కకు నెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ–ఆఫీస్ అమలులోకొచ్చాక పాలనలో జవాబుదారీతనం పెరిగిందని.. ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసే సౌలభ్యముందని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగులు కార్యాలయాలకొచ్చి పనిచేయాలని కోరారు. అప్పుడప్పుడూ ఆలస్యంగా వచ్చినా పట్టించుకోనన్నారు. ఉద్యోగులకు 10వ పీఆర్‌సీకి సంబంధించి రావాల్సిన అరియర్స్, 11వ పీఆర్‌సీ అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఆ తర్వాతే ఒక సంఘటన జరిగింది .
సహజంగా వృద్ధురాలు అయిన ముసలి వాళ్ళు అయిన మహిళలు అయిన సరే ఓపికగా కాసేపు సమయం కేటాయించి ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటారు ఎవరు అయిన మరి ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు . కానీ సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వృద్ధురాలిని నిర్దయగా పక్కకు నెట్టేశారు. తిరుపతి సమీపంలోని తనపల్లె వద్ద శనివారం గృహనిర్మాణ సముదాయాలను ప్రారంభించేందుకు వచ్చిన బాబుకు తన కష్టం చెప్పుకునేందుకు ఒక వృద్ధురాలు వచ్చింది. సీఎంను చూసి నమస్కరించింది. తన సమస్య చెప్పేలోపే బాబు ఆమె వైపు కోపంగా చూస్తూ ఓ చేత్తో ఆమెను నెట్టేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు కంటతడితో వెనుదిరిగింది అక్కడ నుండి .