దీర్ఘకాలిక వ్యాధి సోకిన కుమారుడిని కాపాడుకొనేందుకు ఓ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరింది. దాన్ని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి సోనూసూద్ పేరుతో ఆమెను మభ్యపెట్టి ఎకౌంట్ ఖాళీ చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి 6 నెలల కొడుకు ఉన్నాడు. ఆ బాబుకు దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో వైద్యానికి లక్షలు ఖర్చు …
Read More »షాక్: ఇకపై బంగారం కొనగలమా.. భారీగా పెరిగిన టాక్స్
ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందన్నా మహిళలు ముందుగా బంగారం కొనేందుకే ఇష్టపడతారు. అలాంటిది ఈ సారి బంగారం కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పసిడిపై టాక్స్‌ను భారీగా పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గోల్డ్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచింది. ఇది వరకు 10.75 శాతంగా ఉన్న ఈ టాక్స్‌ను మార్పు చేసినట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. బంగారం దిగుమతులు పెరుగుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »కోమాలో అభిమాని.. ఫ్యామిలీతో మాట్లాడిన ఎన్టీఆర్
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్న అభిమాని కుటుంబ సభ్యులతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. జనార్ధన్ అనే యువకుడు కోమాలో ఉన్న విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న తారక్.. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనార్దన్‌కు ఏం కాదని.. కుటుంబసభ్యులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దామన్నారు. నేనున్నానంటూ ఎన్టీఆర్ భరోసానిచ్చారు. ఆ తర్వాత జనార్దన్ వద్దకు ఫోన్ తీసుకెళ్లమని చెప్పిన …
Read More »కుప్పంలో విశాల్ పోటీ.. క్లారిటీ ఇచ్చిన పెద్దిరెడ్డి
విద్య, వైద్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించామని.. నాడు-నేడుతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం …
Read More »జీహెచ్‌ఎంసీలో బీజేపీకి బిగ్ షాక్..
హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్‌మెట్ …
Read More »ఆ టూరిస్టులు వస్తారు.. రెండు రోజులు లొల్లి పెట్టి పోతారు: కేటీఆర్
తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. 8 ఏళ్ల కేసీఆర్, మోడీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. రెండు రోజులు లొల్లి పెట్టి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ …
Read More »సూపర్ ట్విస్ట్.. ‘మహా’ సీఎంగా ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయాల్లో సూపర్ ట్విస్ట్. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని అంతా భావించారు. కానీ ‘మహా’ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫడ్నవీస్ అనూహ్య ప్రకటన చేశారు. ముంబయిలో గవర్నర్ కోష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కోరారు. అనంతరం …
Read More »వైసీపీ ప్లీనరీలో విజయమ్మ పాల్గొంటారు: విజయసాయిరెడ్డి
గుంటూరు జిల్లాలో త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ ఏపీ రాజకీయ చిత్రపటంపై తనదైన ముద్ర వేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు ఇతర పార్టీల కంటే …
Read More »రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి
అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …
Read More »ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపండి: కొడాలి నాని
వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి …
Read More »