Home / ANDHRAPRADESH / వైసీపీ ప్లీనరీలో విజయమ్మ పాల్గొంటారు: విజయసాయిరెడ్డి

వైసీపీ ప్లీనరీలో విజయమ్మ పాల్గొంటారు: విజయసాయిరెడ్డి

గుంటూరు జిల్లాలో త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ ఏపీ రాజకీయ చిత్రపటంపై తనదైన ముద్ర వేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు.

రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు ఇతర పార్టీల కంటే భిన్నంగా ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. గత ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించి అధికారంలోకి వచ్చామని.. ఈసారి దానికంటే మెరుగైన కార్యక్రమాలను చేపడతామన్నారు.

భవిష్యత్‌ కార్యక్రమాలపై శ్రేణులకు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ కూడా వైసీపీ ప్లీనరీలో పాల్గొంటారని విజయసాయిరెడ్డి వివరించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar