గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More »పవన్ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా?: ఆర్కే రోజా
టెన్త్ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్ ప్రెస్ మీట్ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? …
Read More »మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ..
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.
Read More »అత్యంత విషమంగా ముషారఫ్ ఆరోగ్యం..
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగోలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజులుగా దుబాయ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ముషారఫ్‌కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ముషారఫ్ ఎదిగారు. ఆ తర్వాత ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.
Read More »ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?
దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై …
Read More »ఘనంగా నయనతార -విఘ్నేష్ శివన్ పెళ్లి వేడుక.. తరలివచ్చిన తారాలోకం
ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ మెడలో విఘ్నేష్ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటులు రజనీకాంత్, షారూక్‌ఖాన్ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు వాళ్లంతా మ్యారేజ్ విషెస్ చెప్పారు. నయనతార-విఘ్నేష్ శివన్ …
Read More »వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్ ఘటనపై కేటీఆర్ ట్వీట్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మైనర్‌గా ఉన్న వ్యక్తులు మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Read More »జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై కీలక అప్‌డేట్
జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »లైవ్‌లో లోకేష్‌ను బిత్తరపోయేలా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
టీడీపీ నేత లోకేష్‌కు వైసీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్ బిత్తరపోయారు. వాళ్లను చూడగానే వెంటనే జూమ్ లైవ్‌ను కట్ చేసేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దొంగ ఐడీలతో …
Read More »