బీబీ నగర్ ఎయిమ్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు హరీశ్‌రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం …
Read More »లండన్ కింగ్స్ కాలేజ్‌తో కేటీఆర్ ఒప్పందం
హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్ కాలేజ్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన …
Read More »ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »లవర్‌తో రాసలీలలు.. ఇంట్లోనే భర్తకు దొరికిపోయిన భార్య
లవర్‌తో ఓ జవాన్ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ పరిధిలో జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!
టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …
Read More »వాట్సాప్ ద్వారా 2 మినిట్స్‌లో హౌసింగ్ లోన్!
మీకు హౌసింగ్ లోన్ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల్లో లోన్ లెటర్ ఇవ్వనున్నట్లు హోంలోన్స్ అందించే హెడ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రకటించింది. లోన్ అవసరమైన వారు 9867000000 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా లోన్ ఆఫర్ లెటర్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్ మీటింగ్
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »వాట్సాప్ గ్రూప్ నచ్చట్లేదా? సీక్రెట్‌గా లెఫ్ట్ అయిపోవచ్చు!
మనకు నచ్చని వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయినా అలా అయితే అందరికీ తెలిసిపోతుందనేగా మీ సందేహం? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదండోయ్. మీకు నచ్చని గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినా అడ్మిన్‌కు తప్ప అందులోని మెంబర్స్‌కి ఆ విషయం తెలీదు. ఆ గ్రూప్ అడ్మిన్‌కు మాత్రం మీరు లెఫ్ట్ అయినట్లు కనిపిస్తుందట. దీనికి సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే మీకు …
Read More »మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. బీరు రేటు పెంపు?
మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …
Read More »