మూమూలుగా అయితే కార్లకి, మొబైల్ ఫోన్‌కి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎవరి స్థాయి బట్టి వారు ఖర్చును భరించి తమకు కావాల్సిన నంబర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. ఆటో, బైక్ తదితర చిన్న వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎవరూ దాదాపుగా పట్టుబట్టరు. కానీ.. చండీగఢ్‌లో ఓ వ్యక్తికి ‘ఫ్యాన్సీ’ కిక్ ఉండటంతో భారీ మొత్తంలో చెల్లించి అనుకున్న నంబర్‌ను సొంతం చేసకున్నాడు. ఇంతకీ ఫ్యాన్సీ …
Read More »కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More »అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »దళితబంధుతో అనుకున్నదానికంటే ఎక్కువ లబ్ధి: కేసీఆర్
అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకం మరింత వేగంగా చేరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం కార్యదర్శి రాహుల్‌బొజ్జా కేసీఆర్‌కు వివరించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగానే దళితబంధు నిధులను విడుదల చేసిందని.. అర్హులను గుర్తించి వాటిని అందివ్వడంలో ఆలస్యం …
Read More »ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు వీళ్లే..
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్‌ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు.. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్‌నాథ్ విశాఖ – విడదల రజని అనకాపల్లి – పీడిక …
Read More »కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »ఆవేశంలోనే అలా అనేశాను: వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు
మంత్రి పదవి విషయంలో మాట్లాడిన మాటలు ఆవేశంతో అన్నవే తప్పించి తన మనసులో నుంచి రాలేదని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబూరావు మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం …
Read More »వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్రగాయాలు
లాప్‌ట్యాప్ ఛార్జింగ్‌లో ఉంచి వర్క్ చేసుకుంటుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మేకలవారిపల్లెలో చోటుచేసుకుంది. సుమతి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటుండగా అది పేలి మంటలు వచ్చాయి. దీంతో సుమతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందా? ల్యాప్ ట్యాప్ ఛార్జింగ్‌లో పెట్టి ఎక్కువసేపు అలా వర్క్ …
Read More »మే 1 నుంచి విద్యుత్ కొరత లేకుండా చూస్తాం: పెద్దిరెడ్డి
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో …
Read More »