Home / Jhanshi Rani (page 94)

Jhanshi Rani

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. మూడు రోజులుగా రేప్‌

కోదాడలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడురోజులుగా అత్యాచారం చేశారు. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. మూడు రోజుల తర్వాత సదరు యువతి తమ బంధువులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోదాడ పోలీసులు …

Read More »

మేం వద్దంటున్నామా? దమ్ముంటే అమలు చేయండి: బీజేపీపై కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …

Read More »

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌..

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టులో నరవణే ఉన్నారు. ఏప్రిల్‌ 30న ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది. నరవణే తర్వాత సీనియర్‌గా ఉండటంతో మనోజ్‌ పాండేను నియమించింది. మరోవైపు బిపిన్‌ రావత్‌ అకాల మరణంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) …

Read More »

ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఎక్కడంటే..!

కొవిడ్‌ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 27న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి మంత్రులు, …

Read More »

అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్‌ …

Read More »

కేజీఎఫ్‌ కలెక్షన్స్‌.. మామూలుగా లేవుగా!

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందించిన ‘కేజీఎఫ్ చాప్టర్‌2’ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. తొలి రోజు నుంచే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌లో దూసుకెళ్తోంది. ఫస్ట్‌ డే వరల్డ్‌వైడ్‌గా రూ.134కోట్లకు పైగా రాబట్టగా.. రెండో రోజు కూడా దాదాపు అంతేస్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. రెండోరోజు సుమారు రూ.105 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి. …

Read More »

హీరో ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసుల ఫైన్‌

ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని నీరూస్‌ జంక్షన్‌ వద్ద బ్లాక్‌ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్‌దిగా తేలింది. నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోవడం, బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్‌ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్‌, నాగచైతన్య, …

Read More »

వావ్‌.. హర్భజన్‌ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?

క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్‌ సింగ్‌ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్‌ చేసిన హర్భజన్‌.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …

Read More »

పంజాబ్‌ ప్రజలకు సూపర్‌ న్యూస్..ఇకపై ఫ్రీ!

పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మాన్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆప్‌ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్‌ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …

Read More »

అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా

టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్‌ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్‌ లెగ్‌ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat