రామ్‌గోపాల్ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన …
Read More »గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్.. తొలి కేసు నమోదు
ఈ కొవిడ్ ప్రజల్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వరల్డ్‌వైడ్‌గా కేసులు తగ్గాయి.. ఇక రిలీఫ్ వచ్చినట్లే అని భావిస్తున్న దశలో కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో మాత్రమే వెలుగుచూసిన ఒమిక్రాన్ కొత్తరకం వేరియంట్ ‘XE’ ఇండియాలోనూ బయటపడింది. ముంబయిలో ‘XE’ తొలికేసు నమోదైనట్లు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. సాధారణ కొవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబయిలో 230 మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపారు. …
Read More »‘కేంద్రం కొత్త పథకం తెచ్చింది’.. కేటీఆర్ సెటైర్లు!
పెట్రోల్, డీజిల్ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని …
Read More »పోలీసులపై హల్‌చల్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
పోలీసులపై హల్‌చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనే కార్పొరేటర్ అరెస్ట్‌కు దారితీసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్ ప్రాంతంలో షాపులు బంద్ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్ …
Read More »ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి భారీ విరాళం.. ఎంతో తెలిస్తే షాక్!
తాను ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమై విద్యాసంస్థకు ఓ పూర్వవిద్యార్థి భారీ విరాళం అందించారు. ఐఐటీ కాన్పూర్‌లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఆ విద్యార్థి ముందుకొచ్చి తన వంతుగా రూ.100కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ పూర్వ విద్యార్థి ఎవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు పూర్వవిద్యార్థి, ఇండిగో కో ఫౌండర్ …
Read More »టీఎస్ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …
Read More »ఏపీలో మరో కొత్త జిల్లా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More »గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More »గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!
అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …
Read More »