గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో కంటివెలుగు కార్యక్రమం ఓ చరిత్రాత్మకం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. 3 కోట్ల 70లక్షల మందికి ఉచితంగా పరీక్షలు చేయించి, అవసరమైతే ఆపరేషన్లను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ అంటే ప్రజల్లో భయం ఉంటుందని..అలాంటి భయం అవసరంలేదన్నారు. కంటి పరీక్షలను …
Read More »పురందేశ్వరి, కన్నా ఏపీ ద్రోహులు..కేశినేని నాని
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయాలతో కాంగ్రెస్‌లో కలవరం…!!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని గులాబీ దళపతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలకు కారణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి …
Read More »రాహుల్‌కు అలాంటి ఆరోగ్య సమస్య ఉందంటున్న బీజేపీ లక్ష్మణ్
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయగా పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …
Read More »హరీశ్‌రావు కౌంటర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్తవాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …
Read More »రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది-సీఎం కేసీఆర్..
72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి …
Read More »భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు..కడియం
72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు… సోదర, సోదరీమణులారా! భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు. పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు. ఈ 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు …
Read More »పోచంపల్లికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …
Read More »రాహుల్ బస్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు రహస్య దోస్తీకి ఇదే ఉదాహరణ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నారా? ఇన్నాళ్లు రహస్యంగా సాగించిన దోస్తీని ఆయన బహిరంగంగానే చేయదల్చుకున్నారా? రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ టూర్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆయనతో పాటుగా బస్సులో ప్రయాణించారు. …
Read More »ఆగమాగం ప్రవర్తనతో.. నవ్వుల పాలు అవుతున్న రాహుల్..!!
కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ తీరును చూసి పార్లమెంటు వేదికగా ఎంపీలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అటు పిల్లోడు కాదు అటు పెద్దోడు కాదని ఎద్దేవా చేశారు. జుక్కల్‌లో రూ. కోటితో నిర్మించిన “జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుల నివాసము మరియు కార్యాలయాని”కి జహీరాబాద్ MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో కలిసి ప్రారంభోత్సవం …
Read More »