సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి ఆదయ్య నగర్ నుంచి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు .అమ్మకు బోనం సమర్పించిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.…తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్ర పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు బంగారు బోనానికి ప్రత్యేక …
Read More »గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను టీ న్యూస్ ఎండీ,రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ స్వీకరించారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చూసుకుంటానంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, సినీ నటుడు నాగార్జునకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
Read More »నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతులు..హైదరాబాద్ మహానగరంలోని టోలీచౌకీకి చెందిన మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి దగ్గర అదుపుతప్పి బస్టాండ్ …
Read More »మంత్రి కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సచిన్,లక్ష్మణ్
హరితహారంలో భాగంగా మొదలైన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. హరా హైతో బరా(పచ్చదనంతోనే నిండుదనం) అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు..ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్, ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ చాలెంజ్ చేశారు.మంత్రి సవాలును స్వీకరించిన క్యాథరిన్ హడ్డా శుక్రవారం …
Read More »ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లకు కడియం ఛాలెంజ్
నీరే ప్రాణాధారం..ఆ నీటికి మూలాధారం మొక్క. భవితరాలకి మంచి భవిష్యత్ అందించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి, పెంపొందించాలి. హరిత తెలంగాణను ఆవిష్కరించాలి. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అందరిని హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు *మూడు మొక్కలు నాటండి మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటేందుకు పిలవండి అనే నినాదంతో*గ్రీన్ ఛాలెంజ్* ను మొదలుపెట్టారు. ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఇపుడు ఉప ముఖ్యమంత్రి …
Read More »దివ్యాంగులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతోంది. అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డిగ్రీ చదువుతున్న దివ్యాంగుల కోసం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వారికి అవసరమైన ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక స్కూటర్లు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వికలాంగుల కార్పొరేషన్ …
Read More »టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మరియు ఎన్టీవి అధినేత ఎన్ నరేంద్ర చౌదరికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.ఇవాళ మంత్రి నాయిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాసంలోని తన నివాసం వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన ముగ్గురు అధికారులకు మరియు ముగ్గురు మీడియా యజమానులకు గ్రీన్ …
Read More »గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్ కీలక చొరవ…కేంద్రమంత్రి ప్రశంస
`స్థానిక సంస్థలు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్ల రూపంలో నిధులను సేకరించుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ చూపించాలి“ అని దేశ ప్రధాని నరేంద్రమోడి హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు సూచించారు. ప్రధాని సలహామేరకు బాండ్ల ద్వారా నిధులను సేకరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు …
Read More »ప్రచార పిచ్చితో…నవ్వుల పాలైన బీజేపీ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల కీర్తి కండూతి నవ్వుల వారిని నవ్వుల పాలు చేసింది. తమది కాని ఆచరణను, పనిని ఖాతాలో జమ చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నెటిజన్లు స్పందించిన తీరుతో బీజేపీ నేతల ప్రచారయావ మరోమారు స్పౖష్టమైందని పలువురు అంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వీర్నపల్లి పాఠశాలలో సీఎస్‌ఆర్ …
Read More »మంత్రి కేటీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ..!!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సమావేశం అయ్యారు. తన దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు సహా ఇతర అంశాల గురించి చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయనో ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రకాశ్‌రాజుగారు మీతో సమావేశం అవడం …
Read More »