ఇవాళ ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life. — N Chandrababu Naidu (@ncbn) December …
Read More »బాలయ్య ‘జై సింహా’ టీజర్ విడుదల..!
నందమూరి బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ జై సింహ “. నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా 30 సెకన్ల నిడివిగల టీజర్ విడుదల చేశారు.చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టును చూసి మురిసిపోయిన ఎన్నారైలు
తెలంగాణ ఎన్నారైలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఎన్నారైలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న అనంతరం మిషన్ భగీరథ, డబల్ బెడ్రూం ఇళ్లు, ఎడ్యుకేషన్ హబ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు సందర్శించారు. గురువారం …
Read More »మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్..!
రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్ వరల్డ్ అవార్డును ప్రకటించిన లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. Was an honour to hand over a …
Read More »వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి …
Read More »ప్రింటింగ్ ప్రెస్ కూలోడివి…ఇన్నికోట్లెక్కడివి రేవంత్..?
కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడం చిత్రంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆరెస్ ఎల్పీ లో విలేకరులతో మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు జడ్చర్ల కాంగ్రెస్ …
Read More »సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు
దేశవ్యాప్తంగా ఉత్కంఠను సృష్టించిన గుజరాత్ ఎన్నికలు ఫలితం తర్వాత కూడా అదే ట్విస్ట్‌ను కొనసాగిస్తోంది. గట్టిపోటీ మధ్య గెలుపు సాధించిన రాష్ట్రంలో సీఎం కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేసులో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. బీజేపీ హై కమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు …
Read More »ఆ విషయంలో మనమే నంబర్ వన్..మంత్రి హరీశ్‌రావు
కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలలో కూడా నెంబర్ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. 97 శాతంతో మన రాష్ట్రం గిడ్డంగులను ఉపయోగించుకోవడంలో ప్రథమ స్థానములో నిలిచిందని పేర్కొన్నారు. ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఖండ్, చివరి స్థానములో గుజరాత్ …
Read More »2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం.. సంచలన తీర్పునిచ్చిన కోర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం …
Read More »ప్రశాంతంగా ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్
తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌పై రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 59మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More »