ఆ విలన్ తో డేటింగ్ లో తమన్నా
శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబై భామ తమన్నా. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ …
Read More »విద్య ద్వారానే మహిళల వికాసం
సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని గుర్తు చేశారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం …
Read More »కల్పతరువు హైదరాబాద్
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిదని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్‌లో రూ.263.09 కోట్ల వ్యయంతో 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్‌ను ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ …
Read More »ఏపీలో బీఆర్‌ఎస్ రీసౌండ్
తెలంగాణలో బీఆర్‌ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్‌ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దేశ రాజకీయాల్లో …
Read More »దేశంలో కొత్తగా 176 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.
Read More »తెలంగాణ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక
తెలంగాణలో ఇటీవల టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, …
Read More »మత్తెక్కిస్తోన్న మౌనీ రాయ్ అందాలు
స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు …
Read More »వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ రవిచంద్ర కుటుంబం
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని సోమవారం తెల్లవారుజామున రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని …
Read More »