Home / rameshbabu (page 30)

rameshbabu

 తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి

 తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్‌ చైర్మన్‌-1గా ఉన్న ఆయనను కౌన్సిల్‌ నూతన అఫిషియేటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్‌ పాపిరెడ్డి చైర్మన్‌ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …

Read More »

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు మార్గదర్శకాలివే..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదలచేశారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు. నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు …

Read More »

విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి

 ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్‌ సందర్భంగా స్కూల్‌ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి …

Read More »

ఏ ఎన్నికైన టీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండ విజయం – మంత్రి కేటీఆర్

టీఆర్‌ఎస్‌ పుట్టాక, రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. అందులో హుజూరాబాద్‌ కూడా ఒకటి. అంతేతప్ప మరోటి కాదు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్‌ వ్యూహంపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారే తప్ప.. హుజూరాబాద్‌ అనేపేరు ప్రస్తావించలేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక తేదీ వస్తే దాని ప్రస్తావన వస్తది. అప్పుడు పార్టీ చర్చిస్తది. అంతకుముందే పత్రికల్లో రాసినా.. టీవీల్లో చర్చించినా అదొక …

Read More »

చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు రండి-ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్

సీఎం కేసీఆర్‌ ఏదిచేసినా ముందే అనుమానాలు వ్యక్తంచేస్తరు. బలహీనమైన గుండె ఉన్నవాళ్లు అవలీలగా ఢాం అని అడ్డంపడతరు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిననాడు, తెలంగాణ వస్తది అన్ననాడు కూడా ఇట్లానే పిచ్చిప్రేలాపనలు చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దళితబంధు ప్రారంభిస్తే కూడా ఇట్లనే అంటున్నరు. ముందు నవ్వుతరు. వెకిలి మాటలు మాట్లడతరు. అవమానిస్తరు. ఆఖరికి గెలిచాక పక్కకొచ్చి ఫొటో దిగి పోతరు. అట్లా మాట్లాడేవాళ్లకు నిజంగా చిత్తశుద్ధి …

Read More »

మ‌రో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం

రానున్న 20 ఏళ్లు తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని ఆ పార్టీ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ముగిసింది.  ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై సీఎం చ‌ర్చించారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా …

Read More »

దళితబంధు పథకానికి మరో రూ. 200 కోట్లు విడుదల

దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు …

Read More »

TRS ఎంపీ రంజిత్ రెడ్డి ఔదార్యం!

వికారాబాద్ జిల్లా దరూర్ మండలం గడ్డమీది గంగారాం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, రాష్ట్ర సాధనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాళ్లకు గజ్జె కట్టి, తన గొంతు ద్వారా అనేక పాటలు పాడి ప్రజలను ఉద్యమ ఉద్యుక్తులను చేసి గాయకురాలు భాగ్య కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. ఆమెకు కంటి శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటన లో …

Read More »

క‌రోనా వైర‌స్‌ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటోందా..?

క‌రోనా వైర‌స్‌ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటోంది. సోమ‌వారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు. జూలై త‌ర్వాత జీరో కేసులు నమోదు కావ‌డం ఇదే తొలిసారి. నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ఈ విష‌యాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంది. నాన్‌జింగ్ న‌గ‌రంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో …

Read More »

తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ

బ్యాడ్మింట‌న్ కోర్టులో స్మాష్ షాట్ల‌తో అల‌రించే పీవీ సింధు ( PV Sindhu ).. ఇప్పుడు సాంప్ర‌దాయ దుస్తుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్‌.. త‌న జెర్సీల‌ను ప‌క్క‌న‌పెట్టేసి కొత్త లుక్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తోంది. మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ మెరిసిపోతోంది. పింక్‌, బ్లూ, ప‌ర్పుల్ త్రెడ్‌వ‌ర్క్ ఉన్న ఆ చీర‌లో .. చాలా స‌హ‌జ‌మైన అందంతో …

Read More »