Home / rameshbabu (page 32)

rameshbabu

దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా మరింతగా తగ్గింది. కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 వేలకు పడిపోయిన కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులపాటు పెరిగి, 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా కరోనా కేసులు నమోదులో క్షీణత కనిపించింది. తాజాగా 31 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్‌వేవ్ ముప్పు …

Read More »

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి …

Read More »

నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను డ్రగ్స్‌ అంబాసిడర్‌ అనటంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 …

Read More »

పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్‌

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్ర‌టేరియ‌ట్‌కు వ‌చ్చాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా కాదు.. ప‌నులు అవుతున్నాయా? లేదా? చూడాల‌న్నారు. ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని తాగుబోతు అన‌డం స‌రికాద‌న్నారు. ఎవ‌ర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడుతామ‌ని …

Read More »

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్‌ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …

Read More »

రూర్బన్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ టాప్‌

తెలంగాణ కీర్తి పతాక మరోసారి జాతీయ స్థాయిలో ఎగిసింది. రూర్బన్‌ పథకం అమలులో తొలి రెండు స్థానాలు మన రాష్ర్టానికే దక్కాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ప్రకటించిన రూర్బన్‌ ర్యాంక్‌లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్‌ క్లస్టర్‌ మొదటి స్థానం సాధించగా, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ క్లస్టర్‌ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ర్యాంక్‌లు ప్రకటించింది. ర్యాకల్‌ క్లస్టర్‌కు 91.93, జుక్కల్‌కు 91.52 స్కోర్‌ …

Read More »

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతలు వీళ్ళే

సౌత్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్ వేడుక‌కి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు హాజ‌ర‌వుతుంటారు. వారు ఆ వేడుక‌లో చేసే సంద‌డిని చూసి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోతుంటారు. క‌రోనా వ‌ల‌న గ‌త రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వ‌హించ‌లేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 18,19 తేదీల‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 18న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన …

Read More »

సీక్వెల్ గా రానున్న విక్ర‌మార్కుడు

మాస్ మహారాజు రవితేజ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం విక్ర‌మార్కుడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర‌లో ర‌వితేజ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 2006 సంవత్సరం …

Read More »

వాళ్లకు సంస్కారం నేర్పాలి

ఒకప్పుడు గ్లామర్‌డాల్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. అయితే ఇప్పుడు ఆమె తీరే వేరు. ‘పింక్‌’ తో సరికొత్త అవతారమెత్తిన ఆమె.. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో మంచి కథానాయికగా పేరు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాల్నే ఎంచుకుంటోంది. ముఖ్యంగా బలమైన మహిళా పాత్ర ఉంటే తాప్సీని ఫస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేస్తోందామె. అదే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ సందర్భంగా …

Read More »

పంజాబ్ సీఎం రాజీనామా

పంజాబ్‌ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్‌ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్‌ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్‌ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ …

Read More »