ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న అధికార వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్ సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అశ్లీల వీడియో వెనుక ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన …
Read More »టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
Read More »‘మిస్ సౌత్ ఇండియా’గా ఛరిష్మా కృష్ణ
ఏపీలోని విశాఖ ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోచిలో నిర్వహించిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఛరిష్మా విజేతగా నిలిచింది. ఈమె చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది.
Read More »భారతదేశంలో కరోనా ఉద్ధృతి
భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,893 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 20,419 మంది కోలుకోవడం ఉపశమనం కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478కు చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా.. యాక్టివ్ కేసులు 0.31%గా ఉన్నాయి.
Read More »మరో పాన్ ఇండియా మూవీలో NTR
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ …
Read More »కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా …
Read More »‘మళ్లీ అలాంటి కోహ్లిని చూడాలనుంది’
టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి గత కొన్ని నెలలుగా మంచి స్కోర్ చేసేందుకు ఇబ్బందిపడుతుండటం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లి తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటూ గతంలో చేసిన పరుగులను గుర్తుచేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు బర్మింగ్ హామ్లో జరిగిన ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ లో కోహ్లి 149 రన్స్ చేశాడు. ఇలాంటి కోహ్లిని మళ్లీ …
Read More »వజ్రోత్సవాలు నిర్వాహణపై సీఎం కేసీఆర్ సమీక్ష
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను …
Read More »