దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం 2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
Read More »నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, సురేష్ రెడ్డి, కోలన్ …
Read More »ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాస్ క్రమశిక్షణాయుత జీవనశైలిని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంజాన్ పండుగ మానవసేవ చేయాలనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని.. లౌకికవాదం, మత సామరస్యంలో …
Read More »సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని …
Read More »ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, వారి శ్రేయస్సు కోసం …
Read More »మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన ఈ …
Read More »వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు
వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. …
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన …
Read More »మైనారిటీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి అజయ్
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా …
Read More »ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రశాంత్ వెల్లడించారు. ‘‘పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిచాను. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువవ్వాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు’’ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.
Read More »