Home / rameshbabu (page 454)

rameshbabu

జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Kp

జాతీయ టైలర్స్ దినోత్సవంను పురస్కరించుకొని ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర మేర కుల సంక్షేమ సంఘం వారితో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఓదెల వీరేశం, మారిశెట్టి సత్యనారాయణ, రామగిరి కిషన్, రాచర్ల నరసింహ, వీరప్ప, కొత్తూరి వీరప్ప, మ్యాతరి గంగాధర్, మారిశెట్టి విశ్వనాథ్, కీర్తి, చంద్రమౌళి, కొత్తూరు భాస్కర్, కొత్తూరు …

Read More »

అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇండియాతో ఉక్రెయిన్..?

1998లో దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం …

Read More »

బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోన్న భీమ్లానాయక్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా   శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్. భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు Overseasలోనూ దుమ్ము రేపుతోంది. మూడో …

Read More »

దేశంలో కొత్తగా 8,013 కరోనా కేసులు

దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 …

Read More »

టీడీపీలో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

ప్రేమలో పడ్డ అనన్య పాండే

తాను ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. కొన్నిరోజులుగా హీరో ఇషాన్ ఖట్టర్తో ఈ భామ సన్నిహితంగా ఉంటోంది. దానిపై తొలిసారిగా నోరు విప్పింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదు. ‘నా మీద అతడి ప్రభావం ఎక్కువగా ఉంది. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతడిని ప్రేమిస్తున్నా. నేను లక్కీ’ అని చెప్పింది. వీరిద్దరూ ఖాలీ పీలి సినిమాలో కలిసి …

Read More »

క్యారెట్ తింటే ఎన్ని లాభాలో..

క్యారెట్ తింటే ఎన్ని లాభాలో .. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 2. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 4. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుంది. 5. క్యారెట్లను నేరుగా తినొచ్చు లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిదే.

Read More »

రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా

శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.

Read More »

ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read More »

మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా  అత్యున్నత స్థాయి  ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు హాజ‌రు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat