Home / rameshbabu (page 543)

rameshbabu

శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం

 క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. మాస్కు ధ‌రిస్తేనే మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని ఆల‌య ఈవో ల‌వ‌న్న నిర్ణ‌యించారు. ఇటీవ‌ల క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అవుతుండ‌టంతో.. క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు కొవిడ్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని ల‌వ‌న్న తెలిపారు. భ‌క్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని మైక్ ద్వారా తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో …

Read More »

దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్‌ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు …

Read More »

స్విట్జర్లాండ్‌లో 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌

స్విట్జర్లాండ్‌లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ స్విస్‌మెడిక్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్‌ గ్రూప్‌వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్‌, ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్‌ గ్రూప్‌ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు …

Read More »

టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్ననాథ‌న్ లియ‌న్

ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లియ‌న్ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అత‌ను అందుకున్నాడు. డేవిడ్ మ‌ల‌న్‌ను ఔట్ చేయ‌డంతో 34 ఏళ్ల నాథ‌న్ లియ‌న్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా త‌ర‌పున లియ‌న్ 101వ‌ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెట‌ర్ల‌లో లియ‌న్ 16వ బౌల‌ర్‌ కావ‌డం …

Read More »

యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం

యాషెస్ సిరీస్‌లో భాగంగా జ‌రిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. ఇంగ్లండ్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో 297 ర‌న్స్‌కు ఆలౌటైంది. కేవ‌లం 20 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 5.1 ఓవ‌ర్ల‌లో ఆ టార్గెట్‌ను చేరుకున్న‌ది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచ‌రీ కొట్టిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. స్కోరు బోర్డు ఇంగ్లండ్ 147 & …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయం

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు హోదాలో సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధిస్తారని …

Read More »

సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హారీష్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాప్రతినిథులు మాత్రమే ఓటర్లు కావడంతో 99 శాతం ఓట్లు నమోదవుతాయని తెలిపారు. …

Read More »

సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్

Tollywood కి చెందిన Star Heroine  సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ సమంత చేసిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’. అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1’ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత …

Read More »

Bipin Rawath పలికిన చివరి మాటలు అవేనా..?

హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ …

Read More »

TRSదే విజయం -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆరు జిల్లాలో ఖాళీ అయిన   స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat