భోజనం తర్వాత తమలపాకులు తింటే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి. *తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. *గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. *కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది. *తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. * అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది. * ఉతమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Read More »CM నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి
ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.
Read More »ఆర్టీసీ ఛైర్మన్, MLA బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై టీఎస్ ఆర్టీసీ ఎండీకి లేఖ ఇచ్చారు. తనకు శాసనసభ్యుడిగా వస్తున్న జీతభత్యాలు చాలని పేర్కొన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థపై భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read More »అజీర్తికి చెక్ పెట్టండిలా!
అజీర్తికి చెక్ పెట్టండిలా! . జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. . దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి. . పైనాపిల్లో లభించే డైజెస్టివ్ ఎంజైమ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు.. ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తాయి. • కివీ పండ్లలో ఉండే లక్షణాలు కడుపుకు చాలా మంచివి. • బొప్పాయి కూడా అజీర్ణ …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి మేఘాలయ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మేఘాలయ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పారు. దీంతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
Read More »వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Read More »కన్నకూతురిపై కన్నతండ్రే..!
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,09,940గా ఉన్నాయి. గడిచిన 539 రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న 1,11,481 యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.
Read More »LED దీపాలతో వందల కోట్లు ఆదా- మంత్రి KTR.
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల నిధులు ఆదా అవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘనత అంతా మున్సిపల్‌శాఖ బృందానిదేనని కొనియాడారు. గచ్చిబౌలిలోని పురాతన భావిని పునరుద్ధరించి పూర్వ స్థితికి తీసుకొచ్చిన అధికారులను కేటీఆర్ అభినందించారు. వెల్ డన్ అంటూ మూన్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, చిరేక్ …
Read More »