Home / NATIONAL / కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ పార్టీకి మేఘాలయ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం.

మేఘాలయ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పారు. దీంతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.