టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్ అర్ధ శతకాలతో.. గ్రూప్-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత …
Read More »దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు
దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎక్సైజ్ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్‌పై రెట్టింపు …
Read More »అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్
ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్ అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, ‘రాక్షసన్’ వంటి …
Read More »కొవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్
దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్’ …
Read More »ఏపీలో కరెంటు ఛార్జీల మోత
ఏపీ రాష్ట్ర ప్రజలకు మరో ట్రూఅప్ చార్జీల ముప్పు పొంచి ఉంది. రూ.528.71 కోట్ల వసూలుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది. 2014-15 నుంచి 18-19 మధ్య నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాలకు గాను తనకు రూ.528.71 కోట్ల మేర అధిక వ్యయం అయిందని.. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ …
Read More »ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ
యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసి న అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో …
Read More »దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మోదీ పర్యటన …
Read More »హీరోయిన్ భావన రీ ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ భావన రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘క్రాక్’ మూవీతో మంచి ఫాంలోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాను ఓ స్టార్ హీరోతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ‘క్రాక్’ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం పాన్ …
Read More »కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి జానారెడ్డి షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాగా పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా’’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు జానారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పీఏసీ సమావేశంలో హుజురాబాద్ ఫలితంపై సమీక్ష, వరి సాగు, నిరుద్యోగ …
Read More »మరోక వివాదంలో కంగన రనౌత్
దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …
Read More »