Home / SLIDER / టీమిండియా ఘన విజయం

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 210/2 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్‌), రిషభ్‌ పంత్‌ (27 నాటౌట్‌) ఆఖర్లో విరుచుకుపడ్డారు. కరీమ్‌, గుల్బదిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో అఫ్ఘానిస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 144/7  స్కోరు మాత్రమే చేసింది. కరీమ్‌ (42 నాటౌట్‌), నబి (35) టాప్‌ స్కోరర్లు. షమి (3/32) రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ బదులు టీమ్‌లోకి వచ్చిన అశ్విన్‌ (2/14) రాణించాడు. 

దెబ్బకొట్టిన అశ్విన్‌..:

భారీ లక్ష్యాన్ని అఫ్ఘాన్‌ ఏదశలోనూ ఛేదించే విధంగా కనిపించలేదు. ఓపెనర్లు జజాయ్‌ (13), షహజాద్‌ (0) వికెట్లను అఫ్ఘాన్‌ వెంటవెంటనే కోల్పోయింది. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్న జజాయ్‌ను బుమ్రా క్యాచ్‌ అవుట్‌ చేయగా.. షహజాద్‌ను షమి వెనక్కిపంపాడు. దీంతో 13 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన అఫ్ఘాన్‌ను గుర్బాజ్‌ (19), గుల్బదిన్‌ (18) ఆదుకొనే ప్రయత్నం చేశారు. షమీ వేసిన 5వ ఓవర్‌లో గుర్బాజ్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 24 పరుగులు పిండుకోవడంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి అఫ్ఘాన్‌ 47/2తో నిలిచింది. అయితే, గుర్బాజ్‌ను అవుట్‌ చేసిన జడేజా.. మూడో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. గుల్బదిన్‌, జద్రాన్‌ (11)ను అశ్విన్‌ వెనక్కిపంపడంతో.. మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చింది. కెప్టెన్‌ నబి, కరీమ్‌ ఆరో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యంతో ప్రేక్షకులను అలరించారు. 19వ ఓవర్‌లో షమి బౌలింగ్‌లో జడేజా గ్రేట్‌ క్యాచ్‌ అందుకోవడంతో నబి పెవిలియన్‌ చేరాడు. 

ఓపెనర్ల మెరుపులు..:

తొలి రెండు మ్యాచ్‌ల్లో తుస్సుమన్న టీమిండియా బ్యాటింగ్‌.. ఎట్టకేలకు డైనమైట్‌లా పేలింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌ .. ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు గట్టిపునాది వేశారు. తొలి ఓవర్‌లోనే ఫోర్‌ బాదిన రోహిత్‌.. కాచుకోండంటూ డేంజర్‌ సిగ్నల్‌ పంపాడు. షరాఫుద్దీన్‌ వేసిన 2వ ఓవర్‌లో రాహుల్‌ 4,6తో 16 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు వేగం పుంజుకొంది. నవీన్‌కు గట్టి ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన రోహిత్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్‌ 53/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అప్ఘాన్‌ ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ను ఉతికి ఆరేయడంతో.. 10 ఓవర్లలో టీమిండియా 85/0తో రికార్డు స్కోరు దిశగా సాగింది. 12వ ఓవర్‌లో బౌండ్రీతో రోహిత్‌ అర్ధ శతకం నమోదు చేయగా.. టీమ్‌ స్కోరు కూడా సెంచరీ మార్క్‌ దాటింది. ఆ తర్వాతి ఓవర్‌లో రాహుల్‌ కూడా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే, 15వ ఓవర్‌లో కరీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో రోహిత్‌ క్యాచవుటయ్యాడు. ధాటిగా ఆడిన రాహుల్‌ను గుల్బదిన్‌ బౌల్డ్‌ చేసినా..  ఎడాపెడా బాదేసిన పంత్‌, పాండ్యా..  మూడో వికెట్‌కు 21 బంతుల్లో 63 పరుగులు జోడించడంతో భారత్‌ స్కోరు 200 పరుగుల మార్క్‌ దాటింది. 

స్కోరుబోర్డు

భారత్‌:

రాహుల్‌ (బి) గుల్బదిన్‌ 69, రోహిత్‌ శర్మ (సి) నబి (బి) కరీమ్‌ 74, రిషభ్‌ పంత్‌ (నాటౌట్‌) 27, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 210/2; వికెట్ల పతనం: 1-140, 2-147; బౌలింగ్‌: మహ్మద్‌ నబి 1-0-7-0, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌ 2-0-25-0, 

నవీన్‌ ఉల్‌ హక్‌ 4-0-59-0, హమీద్‌ హసన్‌ 4-0-34-0, గుల్బదిన్‌ నైబ్‌ 4-0-39-1, రషీద్‌ 4-0-36-0, కరీమ్‌ జన్నత్‌ 1-0-7-1. 

అఫ్ఘానిస్థాన్‌:

హజ్రతుల్లా జజాయ్‌ (సి) శార్దూల్‌ (బి) బుమ్రా 13, షహజాద్‌ (సి) అశ్విన్‌ (బి) షమి 0, రహ్మనుల్లా గుర్బాజ్‌ (సి) పాండ్యా (బి) జడేజా 19, గుల్బదిన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 18, నజీబుల్లా జద్రాన్‌ (బి) అశ్విన్‌ 11, నబి (సి) జడేజా (బి) షమి 35, కరీమ్‌ (నాటౌట్‌) 42, రషీద్‌ (సి) పాండ్యా (సి) షమి 0, షరాఫుద్దీన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 144/7; వికెట్ల పతనం: 1-13, 2-13, 3-48, 4-59, 5-69, 6-126, 7-127; బౌలింగ్‌: షమి 4-0-32-3, బుమ్రా 4-0-25-1, హార్దిక్‌ 2-0-23-0, జడేజా 3-0-19-1, అశ్విన్‌ 4-0-14-2, శార్దూల్‌ 3-0-31-0. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat