ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసిన నటించిన ప్రియమణి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో మెరుస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో సుచిత్ర పాత్రతో ప్యాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ఇద్దరు పిల్లల తల్లీగా నటించినా కూడా ప్రియమణి గ్లామరస్‌గానే కనిపించారు. నారప్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ ఎంతగానో అలరించింది. ఇక విరాట పర్వం చిత్రంలోను కీలక పాత్ర పోషించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతుంది ప్రియమణి. …
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. ఇందులో 3,13,02,345 మంది బాధితులు కోలుకోగా, మరో 3,85,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి …
Read More »ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు అగ్రహజ్వాలలు
హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్‌అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్‌చార్జి …
Read More »తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్‌బోర్డు చరిత్రలో ఫస్టియర్‌లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »పట్టణ స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్‌ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు. అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందని, …
Read More »1.20 లక్షల మందితో సీఎం కేసీఆర్ సభ
విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు …
Read More »కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్
ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …
Read More »కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతి
ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగులమ్మ ఆలయ ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపణతో ఓల్డ్ ఆర్సీపురంలో పండుగ వాతావరణం నెలకొందని …
Read More »దుమ్ము లేపుతున్న హీరో శ్రీకాంత్ తనయుడి ”పెళ్లి సందD” మూవీ టైటిల్ లిరికల్ వీడియో సాంగ్
”పెళ్లి సందD” చిత్రం నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్‌గా ”పెళ్లి సందD” రూపొందుతోంది. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకురాలు గౌరి రోనక్ తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా ద్వారా మొదటిసారి రాఘవేంద్రరావు వెండితెరపై సందడి చేయబోతుండటం విశేషం. కాగా …
Read More »