జాతీయ చేనేత దినోత్సవం ( National Handloom Day ) సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి …
Read More »దుమ్ములేపుతున్న ఆది “బ్లాక్” మూవీ టీజర్
హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు. వరుస సినిమాలను …
Read More »రాఘవ లారెన్స్ “దుర్గ” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సీనియర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘దుర్గ’. తాజాగా దీని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆయన ‘ముని’ సిరీస్‌లో వచ్చిన చిత్రాల మాదిరిగా ‘దుర్గ’ ఫస్ట్‌లుక్‌లోను భయపెట్టే మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నటించిన హారర్ చిత్రాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ తరహాలోనే ఇది కూడా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్‌తో తెలిపారు. ఈ మూవీని లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, …
Read More »కియారా అద్వానీకి రెమ్యునరేషన్ రూ.5 కోట్లా..?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట. ప్రస్తుతం మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్ గోవా వెళ్లడానికి …
Read More »అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం – ఒక్కరోజే 1,09,824 కరోనా కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడ గురువారం ఒక్క రోజే ఏకంగా 1,09,824 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సగటున రోజుకు 98,518 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అంటే వారం రోజులుగా రోజుకు సుమారు లక్ష కరోనా కేసులు రికార్డయ్యాయన్నమాట. మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే ఈ కరోనా కేసులు 277శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి …
Read More »రైతు బీమాకు రూ. 800 కోట్లు విడుదల
తెలంగాణలో రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది.ఈ మేరకు బడ్జెట్ విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం …
Read More »కృష్ణా, గోదావరి జలాల వాటాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ …
Read More »దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయింది
దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …
Read More »రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు
హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Read More »