ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను …
Read More »మంత్రి కేటీఆర్ తో సింగపూర్ హైకమిషనర్ సమావేశం..
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు.ఈరోజు ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ మరియు తెలంగాణ గురించి మంత్రి కే తారకరామారావు పలు వివరాలు అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని …
Read More »లండన్ లో నిరాడంబరంగా “టాక్ లండన్ బోనాల జాతర”
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి …
Read More »వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు ..
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ గారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి హరీష్ రావు… వారి ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెల్సుకొని మెరుగైన చికిత్స అందించాలని కోరారు , త్వరగా కొలుకొని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని , …
Read More »6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై..ఆ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50కోట్లు ఇచ్చి.. రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా యాక్టర్ రేవంత్ ఫీల్ అవుతున్నారని..తెలంగాణ పీసీసీ పదవి వస్తే సీఎం అయినట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం …
Read More »బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
Read More »పనసతో బోలెడు లాభాలు
పనసతో బోలెడు లాభాలు పనస కాయలో పీచు పదార్థాలు ఎక్కువ. అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు,ఎముకల బలహీనతను నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ నరాల రుగ్మతలను నివారిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది పనస.
Read More »ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,578 మంది కరోనా బారిన పడ్డారు. మరో 22 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,24,421కు చేరగా, మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. కొత్తగా 3,041 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 18,84,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 696 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాబారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు.. 97.08శాతంగా ఉంది. కొత్తగా 858మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు చేశారు.
Read More »కరోనా థర్డ్ వేవ్ తప్పదా..?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్-IMA.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల అమలుపై నిర్లక్ష్యం తగదని సూచించింది. ఇలాంటి ఘటనలే థర్డ్ వేవ్కు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అంశంపై మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని సూచించింది.
Read More »