ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి 219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …
Read More »బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి అవసరం
బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా బొప్పాయి ఫేస్ప్యాక్ వేసుకోండి. బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల బొప్పాయిలోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
Read More »రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »దేశంలో కొత్తగా43,071 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 955 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు ఇదే సమయంలో కరోనా నుంచి 52,299 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య: 3,05,45,433 మరణాలు: 4,02,005 కోలుకున్నవారు: 2,96,58,078 యాక్టివ్ కేసులు: 4,85,350
Read More »రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం- ఆ పథకంలో చేరితే రూ.15లక్షలు
వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.
Read More »తెలంగాణలో 19 వేల పోలీస్ కొలువులు- భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో …
Read More »కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రేవంత్ కు పీసీసీ-ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవి రాగానే రేవంత్‌కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులకు గౌరవాన్నిచ్చేలా ఉన్నత విలువలు పాటించాలని ఎవరైనా చూస్తారు కానీ, రేవంత్ మాత్రం వాటిని దిగజార్చేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనవుతారని పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటికైనా లంగా.. లుచ్చా మాటలు మానుకోవాలని హితవుపలికారు. తామంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ …
Read More »చుక్క నీటినీ వదులుకోం- ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం
కృష్ణా జలాల్లో తమ వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. జల విద్యుదుత్పత్తిని కూడా ఆపేదిలేదని స్పష్టంచేసింది. తెలంగాణ హక్కులను కాలరాస్తూ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నేపథ్యంలో గతంలో స్నేహపూర్వకంగా చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఇక చెల్లవని.. కృష్ణా జలాల్లో కచ్చితంగా చెరిసగం వాటా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ వ్యవసాయం, రైతుల …
Read More »పరిశుభ్రంగా ఉండండి.. అంటువ్యాధులను అరికట్టండి : మంత్రి కేటీఆర్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో …
Read More »పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి …
Read More »