తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.
Read More »విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More »కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.
Read More »ఇలియానా సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ ఇలియానా సినీ రంగంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఏ మాత్రం లభించదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. కొన్నింటిని చూస్తూనే ఉండాలి. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది’ అని ఇలియానా చెప్పింది.
Read More »ఖర్జూరం తింటే
ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.
Read More »వేడి వేడి టీ తాగితే…?
చాలా మందికి పొద్దున్నే టీ తాగనిదే పొద్దు గడవదు. అయితే మరీ హాట్ ఛాయ్్న తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి టీ వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై తొమ్మిదేళ్లు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు… పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రోజూ వేడి వేడి టీ లేదా కాఫీ తీసుకునేవారిలో క్యాన్సర్ అవకాశాలు …
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు
కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. నేటితో ముగియనున్న లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. నేటి వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు. ఇక ప్రతీ …
Read More »నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …
Read More »మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే
అచ్ఛేదిన్ కహా..? తిరోగమనంలోకి దేశం – ప్రధాని విధానాలు ప్రమాదకరం – నోట్లరద్దు నుంచి కోవిడ్-19 వరకు ప్రతిదీ విఫలమే – ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు …
Read More »