Home / rameshbabu (page 767)

rameshbabu

ఈట‌ల ఒక మేక‌వ‌న్నె పులి : మంత్రి గంగుల

ఈట‌ల రాజేంద‌ర్ ఒక మేక‌వ‌న్నె పులి. బ‌ల‌హీన వ‌ర్గాల ముసుగులో ఉన్న‌ పెద్ద దొర. ఆయ‌న హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైద‌రాబాద్‌కు వ‌స్తే ఓసీ అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజ‌శేఖ‌ర్ రెడ్డితో, కిర‌ణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈట‌ల చెబుతున్నారు. కేవ‌లం దేవ‌ర‌యాంజ‌ల్ భూముల కోసమే ఆయ‌న మాట్లాడారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ సంక్షేమం గురించి …

Read More »

11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సరికొత్త మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లో మహేష్ పేరు అదే. ఇప్పుడదే పేరుని ఈ సినిమా టైటిల్గా ఫైనల్ చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read More »

హెర్బల్ టీ తాగితే..?

ఒంట్లోని మలినాలను తొలగించడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకోసం హెర్బల్ టీ తాగితే చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ తాగితే అజీర్తి, ఇతర సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలు, సోంపు.. నీళ్లలో వేసి మరిగించాలి. ఈ హెర్బల్ టీని వడబోసుకొని వేడిగా తాగేయాలి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాపు, గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో TPCC అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినా.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రక్రియ ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశంపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. అధిష్టానం నిర్ణయం మార్చుకుందని, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పేరు కూడా ఉందని …

Read More »

కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం

కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు యోగితా సోలంకి (42) కరోనా సోకి మరణించారు. గత వారం రోజులుగా ఆమె ఇండోర్లోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 80 శాతం వరకు వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు

Read More »

తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 70,961 మందికి పరీక్షలు జరపగా 6,876కేసులు నమోదయ్యాయి. 59 మంది కరోనా బాధితులు మరణించారు. ఈ మేరకు తెలంగాణ హెల్త్ బులెటిన్ ను ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,432 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read More »

హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.

Read More »

నేడు ఈటల కీలక ప్రకటన

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.

Read More »

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం

తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat