Home / LIFE STYLE / హెర్బల్ టీ తాగితే..?

హెర్బల్ టీ తాగితే..?

ఒంట్లోని మలినాలను తొలగించడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకోసం హెర్బల్ టీ తాగితే చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ తాగితే అజీర్తి, ఇతర సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.

టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలు, సోంపు.. నీళ్లలో వేసి మరిగించాలి. ఈ హెర్బల్ టీని వడబోసుకొని వేడిగా తాగేయాలి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాపు, గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.