Home / rameshbabu (page 775)

rameshbabu

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.

Read More »

కరోనా సోకిన వారు ఇవి తినాలి..?

మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా  లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …

Read More »

అనుష్కకు పెళ్ళా..ఎవరితో…?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న స్వీటీ కుటుంబసభ్యులకు.. ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. అతడు దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకని, అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడని తెలిసింది. కరోనా తగ్గితే ఇరుకుటుంబాలు చర్చించుకొని పెళ్లికి ముహుర్తం పెట్టుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.

Read More »

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …

Read More »

సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్  గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు  ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.

Read More »

సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat