బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …
Read More »ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …
Read More »సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం …
Read More »దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు …
Read More »తెలంగాణలో పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో …
Read More »ఇది తెలంగాణ విజయం – మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానాన్ని కేంద్రం ఆమోదించడం సంతోషకరం అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం తెలంగాణ విజయం అని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోనల్ విధానంతో యువత న్యాయమైన వాటా పొందొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »ధోనీ తల్లిదండ్రులకు కరోనా
సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …
Read More »తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మే 26 చివరి వర్కింగ్ డే అని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పది పరీక్షలను రద్దు చేసినా, టీచర్లు మాత్రం రోజూ డ్యూటీకి హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించి, 24 నుంచి సెలవులు …
Read More »