నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు …
Read More »కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కేటీఆర్
సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారు. పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ ఉద్ఘాటించారు. మీ ముఖాల్లో చిరునవ్వును చూసిప్పుడే తమకు …
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »కోహ్లికి అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.
Read More »మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత
ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More »ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి,క్యూట్ భామ రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ పాగా వేయబోతుంది. అక్కడ ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ల్లో నటిస్తోంది. ‘గుడ్ బై’లో బిగ్ బీ అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఆయన గురించి చెబుతూ.. ‘ఎంతో ఎగ్జిట్ మెంట్, టెన్షన్తో ఈ సినిమా షూటింగ్కు వెళ్లాను. బిగ్ బీ చాలా కూల్ పర్సన్. బాగా మాట్లాడారు. దాంతో టెన్షన్ మొత్తం పోయింది. …
Read More »తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.
Read More »జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 2,17,353 మందికి కరోనా సోకగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా మరణాల సంఖ్య 1,74,308గా ఉంది. తాజాగా 1,18,302 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనాను జయించారు. 15,69,743 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 14,73,210 …
Read More »నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
Read More »