శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »బ్యాంకులకు 7రోజులు వరుసగా సెలవులు.. ఇందులో నిజం ఎంత..?
బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు అంటూ మొత్తం 7 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మధ్యలో కేవలం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ శుక్రవారంలోపు మీ బ్యాంకు పని …
Read More »రొమాంటిక్ ప్రేమ కథాంశంతో అనుష్క
బొమ్మాళి అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమా రొమాంటిక్ ప్రేమ కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో 40 ఏళ్ల మహిళ పాత్రలో అనుష్క, 20 ఏళ్ల కుర్రాడిలా నవీన్ పొలిశెట్టి కనిపించనున్నారని టాలీవుడ్ టాక్. ఈ లేటు ఘాటు ప్రేమ కాన్సెప్టు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది
Read More »బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.
Read More »కొత్తిమీర జ్యూస్ తాగితే..?
కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read More »పసుపు పాలతో లాభాలెన్నో..?
పసుపు పాలతో హాయిగా నిద్ర పాలలో సెరొటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దీంతో రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పసుపులో ఉండే కుర్ క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం-మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా హార్వెస్టర్లు, ఇన్నోవర్స్, రీపర్ల వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకు 6,66,221 మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 951 కోట్ల 28 లక్షలు ఖర్చు చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి కార్యాచరణ ప్రక్రియ …
Read More »