Home / SLIDER / తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ్యులంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశాల్లో స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్టారు.

ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన వెంట‌నే బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభించ‌నున్నారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టితో ముగియ‌నున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు.

ఇవాళ నీటిపారుదల, సాధారణ పరిపాలన, కార్మికశాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్‌, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై చర్చించనున్నారు. వీటితోపాటు సవరణల బిల్లులు కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. ఇందులో ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులు ఉన్నాయి.