Home / rameshbabu (page 842)

rameshbabu

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …

Read More »

రీల్ పాత్రలో రీయల్ లాయర్..?

తమిళ స్టార్ హీరో మోహన్ లాల్,అలనాటి అందాల భామ మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం-2’ సినిమాలో రేణుక అనే లాయర్ పాత్ర పోషించారు నటి శాంతి ప్రియ. ఈమె మూవీలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అడ్వకేట్ కావడం విశేషం. కేరళలోని ఎర్నాకులంలోనే లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన శాంతి.. గతంలో సుప్రీంకోర్టులోని శబరిమల కేసు విచారణలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. కేరళ హైకోర్టులో ఇప్పటికీ కేసులు వాదించే ఈమె.. …

Read More »

తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,712కు చేరింది. ఇందులో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,94,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోగా… మొత్తం 1,625 కరోనా మరణాలు సంభవించాయి

Read More »

దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.

Read More »

కృతిశెట్టికి ‘ఉప్పెన’లో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా..?

‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.

Read More »

అనసూయ సంచలన నిర్ణయం

ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.

Read More »

బీజేపీలోకి పీటీ ఉష

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ   ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ   అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్   ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.

Read More »

మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా శ్రీలత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat