Home / NATIONAL / దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
Coronavirus or Flu virus isolated - Microbiology And Virology Concept

దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది.

ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.