కరోనా లాక్ డౌన్, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020 జూన్ నాటికి దేశంలో 55.41% ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లుండగా.. సెప్టెంబర్ కు అది 57.29%గా ఉంది. ఇక వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా చూస్తే మహారాష్ట్ర తొలి స్థానంలో, ఏపీ-తెలంగాణ సర్కిల్ 2వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69% మందికి …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుంది. ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే వాట్సాప్ నంబర్ 949067444కు తెలియజేయాలని సూచించారు
Read More »కరీంనగర్ జిల్లాలో ఒకే ఊరిలో 33మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది, రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు… ఆయన అంత్యక్రియలు, కర్మకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్గుంపూర్ వాసులు వచ్చారు. వీరిలో కొందరికి లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా… 33నుందికి కరోనా వచ్చింది. దీంతో ఇవాళ కూడా గ్రామంలో కరోనా టెస్టులు చేయనున్నారు.
Read More »శ్రమించే అమ్మే.. చదివించే టీచర్.. ఓ అమ్మ కథ మీకోసం..
చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజం. పై చిత్రంలో కన్పిస్తున్న మహిళ పేరు రమ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం తడ్కల్ నుంచి ఇద్దరు పిల్లలతో కల్సి ఆమె కుటుంబం హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చారు. నగరంలోని అంబర్ పేటలో ఉంటోంది. రమ భర్త రమేష్ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చే కొద్దిపాటిసంపాదనతో జీవన గడుపుతూ ఉండేవారు. అయితే కరోనా మహమ్మారి ఎందరో …
Read More »రాత్రి పూట మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..?
ప్రస్తుతం రాత్రి పూట మొబైల్ వాడడం చాలా ప్రమాదకరం. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తి తగ్గుతుంది. అతిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం స్పెర్మ్ ప్రోగ్రెసివ్ మొబిలిటీని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రేడియేషన్ ఆడవారిలో గర్భస్రావానికి ఓ కారణమని గుర్తించారు. అందువల్ల రాత్రి పూట మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …
Read More »తులసి ఆకులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు..!
తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? చర్మరోగాలను నివారిస్తుంది ఆస్మా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది కఫాన్ని నివారిస్తుంది కడుపులో నులి పురుగుల్ని నిర్మూలిస్తుంది. ఆకలిని వృద్ధి చేస్తుంది రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మలబద్ధకం తగ్గుతుంది కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది
Read More »ఏపీ సీఎం జగన్ ప్రధాని కావాలి-డిప్యూటీ సీఎం నారాయణ
ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,బీజేపీ,జనసేన,కమ్యూనిస్టులు ఒక్క మాట మాట్లాడినా. వైసీపీ నేతలు మూకుమ్మడిగా స్పందిస్తారు. అలాగే సీఎం జగన్ ను కూడా ప్రశంసిస్తుంటారు. కుప్పంలో వైసీపీకి చెందిన మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ‘ ప్రజలకు ఇంత మేలు చేస్తున్న జగన్ ఒకసారి ప్రధాని కావాలి. ఇందుకోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నా, కుప్పం ప్రజలకు …
Read More »అధికార వైసీపీకి షాక్
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నియంతృత్వ పోకడలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి మామయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలిపారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేయకపోతే పెన్షన్లు ఇళ్లు వంటి పథకాలు వర్తించవని వాలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారు. ఇది సరైన విధానం కాదు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోంది’ అని ఆయన …
Read More »చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.
Read More »