తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిలైన వారికి ఇంటర్ బోర్డు ఊరట కల్గించింది. 2020 మార్చి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షల్లో 70% సిలబస్, 50% ఛాయిస్ వర్తింపజేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీతో పాటు సెకండియర్ పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించారు. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులను ఇప్పటికే పాస్ చేశారు
Read More »గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020” గా ప్రకటించాయి. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా. ఆరోగ్యకరమైన సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.
Read More »ఆ కలను నెరవేర్చుకున్న బుట్టబొమ్మ
మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా హెగ్డే ప్రస్తుతం తన హవా కొనసాగిస్తుంది. వరుస బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. గత ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో అలరించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హిందీలోను పూజా నటిస్తుండగా సల్మాన్ సరసన కభీ …
Read More »మోహన్ బాబుకు రూ.1లక్ష జరిమానా..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ రూ.లక్ష జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 1లోని ప్లాట్ నంబర్ 6 వద్ద మోహన్‌బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటుచేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ.. చలాన్ వేసింది.
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రగతి అద్భుతం
వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …
Read More »లంగా ఓణిలో ఇరగదీస్తున్న దిశా పటాని
లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని . టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు లభించకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ మంచి ఆఫర్స్ అందుకుంటుంది. చివరిగా మలంగ్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దిశా పటాని త్వరలో రాధే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజులుగా దిశా పటాని బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది. …
Read More »మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..? రక్తపోటును తగ్గిస్తాయి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి క్యాన్సర్ల నివారణకు సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి
Read More »యాలకులతో ప్రయోజనాలు
యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి నోటి అల్సర్ ను అరికడుతాయి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీసన్ను అరికడుతాయి
Read More »నిధి అగర్వాల్ కి షాక్
తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.
Read More »సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది
Read More »