Home / MOVIES / ఆ కలను నెరవేర్చుకున్న బుట్టబొమ్మ

ఆ కలను నెరవేర్చుకున్న బుట్టబొమ్మ

మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన పూజా హెగ్డే ప్ర‌స్తుతం త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

గ‌త ఏడాది అల వైకుంఠ‌పురములో చిత్రంతో అల‌రించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక హిందీలోను పూజా న‌టిస్తుండ‌గా స‌ల్మాన్ స‌ర‌స‌న కభీ ఈద్ క‌భీ దీవాలి, ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న సర్క‌స్ అనే చిత్రాలు చేస్తుంది.

ఆచార్య చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కూడా పూజానే క‌థానాయిక అనే టాక్ న‌డుస్తుంది. చేతి నిండా వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న పూజా హెగ్డే నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకొని త‌న కోరిక‌లు తీర్చుకుంటుంది.

ముంబైలోని బాంద్రాలో ఇల్లు కొనుక్కోవాలని పూజా చిర‌కాల కోరిక కాగా, దానిని ఎట్ట‌కేల‌కు తీర్చుకుంది.  స్కైలైన్ వ్యూ ఉన్న 3బిచ్‌కె అపార్ట్‌మెంట్‌ను  పూజా రీసెంట్‌గా కొనుగోలు చేసిన‌ట్టు  సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియ‌ర్ డిజైనింగ్ ప‌నుల‌న్నింటిని పూజా ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటుంద‌ట‌. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లోను ఓ ఇల్లు కొనాల‌నే ఆలోచ‌న‌లో పూజా ఉంద‌ని స‌మాచారం.