తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా …
Read More »నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …
Read More »సౌందర్య జీవితంపై బయోపిక్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సినీయర్ హీరోయిన్ దివంగత సౌందర్య జీవితంపై బయోపిక్ రానున్నది. దక్షిణాదిలోనే వందకుపైగా చిత్రాల్లో తన అద్భుతాభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె విషాదాంత మరణం ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేసింది. ఈ నేపథ్యంలో ఆమె సినీ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సౌందర్య పాత్రను సాయిపల్లవి పోషించనుందని …
Read More »తెలంగాణలో పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్‌శాఖ పరిశీలిస్తున్నది. మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. …
Read More »దుబ్బాకలో రూ.104.09 కోట్లతో విద్యుత్ పనులు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్ జిగేల్‌మంటున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్, బొప్పాపూర్, కాసులాబాద్, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్‌పల్లి, అనాజీపూర్, కాసన్‌పల్లి, అనంతసాగర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను 14 కొత్త …
Read More »అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు భారీ షాక్..
టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ యూత్ అద్యక్షుడు మిట్ట నిషాంత్ గౌడ్,ఎన్.ఎస్ యూ.ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కపిల రాజేశ్ సుమారు 400 మందితో కలిసి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ …
Read More »దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్‌రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలకు వివించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచార సరళిని వారికి వివరించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్రపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణంతో దుబ్బాకలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో రామలింగా రెడ్డి భార్య సుజాతను టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. మంత్రి హరీశ్‌రావు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలు వచ్చేనెల 3న జరగున్నాయి. …
Read More »ఏపీలో కొత్తగా నమోదైన 5,653 కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,653 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ బారినపడిన వారిలో మరో 35 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,517 మంది కరోనా బారినపడగా 6,97,699 మంది కోలుకున్నారు. మరో 46,624 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »అసెంబ్లీలో కంగనా రనౌత్
అసెంబ్లీలో కంగనా రనౌత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనుంది. కరోనా వలన ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడగా, కొద్ది రోజుల క్రితం తాజా షెడ్యూల్ నిర్వహించారు. ఆ షెడ్యూల్ చిత్రీకరణ …
Read More »