రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి రాఖీ కట్టారు.
Read More »ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా
ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్ సచివాలయ …
Read More »భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా…771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది …
Read More »టిక్ టాక్ ప్రియులకు శుభవార్త
టిక్‌టాక్ విషయంలో అమెరికాలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్టే కనిపిస్తోంది! టిక్‌టాక్‌ను కొనుగోలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ప్రకటించింది. సెప్టెంబర్ 15 కల్లా ఇందుకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేస్తామని తెలిపింది. టిక్‌టాక్ కొనుగోలు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఈ డీల్ విషయమై మైక్రోసాఫ్ట్ …
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాకి కరోనా
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్లో ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాహుల్ జిందాల్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్పొరేట్ దిగ్గజాలు .. గౌరవ రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది .. ప్రపంచ సమాచార సాధనం , మానవునికి ఏదైనా సమాచారం కావలి అంటే గూగుల్ ని అడగకుండా ఉండలేం .. అలాంటి సంస్థకి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ జిందాల్ గారు తన నివాసం , ఛత్తీస్గఢ్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గిరీష్ చంద్ర
దేశమంతట కొనసాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సమాజం బావుండాలనే తపన కలిగిన ప్రతి ఒక్కరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఇండియన్ పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకం విజేత మానసి గీరిష్ చంద్ర జోషి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాజధాని …
Read More »ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …
Read More »తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది. యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.
Read More »