Home / ANDHRAPRADESH (page 43)

ANDHRAPRADESH

‘మిస్ సౌత్ ఇండియా’గా ఛరిష్మా కృష్ణ

ఏపీలోని విశాఖ ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోచిలో నిర్వహించిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో  మంచి ప్రతిభ కనబరిచిన ఛరిష్మా విజేతగా నిలిచింది. ఈమె చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది.

Read More »

‘ఉమామహేశ్వరి సూసైడ్‌.. చంద్రబాబు వచ్చాకే ఆ లేఖ మాయం చేశారు’

ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని …

Read More »

భూ సర్వే.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్‌ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలని.. …

Read More »

ఎన్టీఆర్‌ కుమార్తె సూసైడ్‌ చేసుకున్నారా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్‌ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …

Read More »

చంద్రబాబుపై మంత్రి రోజా సెటైర్లు

ఏపీలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని  ఆ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. టీడిపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న  తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలవడంపై దృష్టి పెడితే మంచిదని మంత్రి రోజా హితవు పలికారు. చంద్రబాబు మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రాన్నే అమ్మేస్తారని వ్యంగ్యంగా ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు …

Read More »

ప్రియుడితో మళ్లీ వైజాగ్‌ వచ్చిన సాయిప్రియ

వైజాగ్‌ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్‌ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

ఏపీలో మంకీ పాక్స్ కలవరం

ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో  మంకీపాక్స్‌ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం   పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …

Read More »

ఏపీ.. గోదావరిలో వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. …

Read More »

ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?

 ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన  టీడీపీకి చెందిన  నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్‌ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat