టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్07హెచ్ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …
Read More »చిరంజీవిపై కామెంట్స్.. నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …
Read More »ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …
Read More »ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్‌సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.
Read More »ఏపీ యువకుడు.. అమెరికా క్రికెట్ టీమ్‌కి ఎంపిక
ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన శివకుమార్ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలి ఇంటర్నేషనల్‌మ్యాచ్‌ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల …
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. రాకపోకలు బంద్
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్‌పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. …
Read More »