Home / ANDHRAPRADESH (page 58)

ANDHRAPRADESH

నార్త్‌, సౌత్‌ ‘సినిమా వార్‌’.. ఆర్జీవీ సెన్సేషనల్‌ కామెంట్స్‌

ఇటీవల నార్త్‌, సౌత్‌ సినిమాల విషయంపై ట్విటర్‌ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్‌ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్‌ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్‌ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ …

Read More »

బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి …

Read More »

ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇచ్చిన మాట తప్పను: జగన్‌

తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …

Read More »

ఎమ్మెల్యేల పనితీరుపై జగన్‌ సర్వే చేయించారు: కొడాలి నాని

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్‌ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …

Read More »

గేర్‌ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్‌

మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …

Read More »

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ

సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్‌ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …

Read More »

హైకోర్టు సీజేతో సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్‌ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …

Read More »

వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్‌ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read More »

చంద్రబాబు, బొండా ఉమా హాజరుకావాల్సిందే: వాసిరెడ్డి పద్మ

టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌ను తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయవాడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వద్ద అడ్డుకున్న వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్‌ సుప్రీమా? అంటూ బొండా ఉమ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో …

Read More »

బండి సంజయ్‌.. నీకు దమ్ముంటే ఆ నిధులు రప్పించు: హరీశ్‌ సవాల్‌

తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat