Home / ANDHRAPRADESH (page 66)

ANDHRAPRADESH

లవ్‌ చేయలేదని కాలేజ్‌స్టూడెంట్‌ గొంతుకోసిన ఆటోడ్రైవర్‌

నెల్లూరు: ఎన్నాళ్లు వెంటపడుతున్నా ప్రేమించడం లేదని ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌ గొంతు కోసేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన ఓ విద్యార్థిని (17 సంవత్సరాలు) ఇంటర్‌ చదువుతుంది. ఆ ఏరియాకే చెందిన ఆటో డ్రైవర్‌ కృష్ణ ప్రేమ పేరుతో విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కృష్ణ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో …

Read More »

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పీచ్‌.. జగన్‌ నవ్వులే నవ్వులు

అమరావతి: సారాను విచ్చలవిడిగా ఊరూరా ప్రవహించేలా చేసింది టీడీపీ చీఫ్‌ చంద్రబాబే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. శాసనసభలో నారాయణస్వామి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సారా వ్యవహారంలో రూ.550కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారని.. ఆయనపై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం ఆయనకు బాగా …

Read More »

ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్‌’ రచ్చ.. !

అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్‌’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్‌ స్పైవేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్‌ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్‌ను కొనలేదని చెప్పారు. ఈ …

Read More »

పవన్‌.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్‌ పాలిటిక్స్‌?

‘దరువు.కామ్‌’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్‌ కట్‌ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …

Read More »

చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈసారి…?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాకర్స్ గట్టి షాకిచ్చారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన ట్విట్టర్  అకౌంటును హ్యాక్ చేశారు. అయితే హ్యాకింగ్ గురైన అంశాన్ని గుర్తించిన ఆ పార్టీకి చెందిన ప్రధాన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుండి అసభ్యకరమైన ట్వీట్లను,మెసేజ్ లను పంపినట్లు ఐటీ విభాగం గుర్తించింది. …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ గుడ్‌న్యూస్‌

విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …

Read More »

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరూ బతకలేరంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన సెనియర్  నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ  ‘అవును, వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం …

Read More »

RRR..ఏపీలో అదనపు టికెట్‌ రేట్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్‌ రేట్లను  రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.  దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్‌ మినహా నిర్మాణానికే  రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌  …

Read More »

పవన్‌ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్‌ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ సభ పెట్టారని ఆరోపించారు.  ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై  విమర్శలు చేశారు. సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …

Read More »

జరగనిది జరిగినట్లు టీడీపీ విషప్రచారం: జగన్‌

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో  సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌, మున్సిపల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat