ఏపీలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది ఇవాళ 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,899కి చేరింది. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 7,163కి పెరిగింది. ఇక ఇవాళ 60 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులున్నాయి
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »రేవంత్ అరెస్ట్ తప్పదా…?
తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది
Read More »ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించిన SEC.. ఈ నెల వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్న SEC ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి సూచించింది.
Read More »ఏపీలో టీడీపీకి షాక్
ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
Read More »ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకో PS ఏర్పాటు చేసి… వ్యవసాయ అంశాల్లో మోసాలు జరిగితే రైతుల అండగా నిలిచేలా చూడాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. రైతుల కోసం స్పెషల్ డెస్క్ …
Read More »ఏపీలో నేటి నుండి మలివిడత కరోనా టీకా పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మలివిడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనున్నారు.. కోవిన్ యాప్ లో 5.90 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు తొలి విడతలో 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకు 48.90శాతం మందికి టీకాలు పంపిణీ చేయగా.. 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి
Read More »