Home / ANDHRAPRADESH / YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే కాపీ చేస్తోంది..

ఎవరు పార్టీ పెట్టినా తమకు నష్టం లేదన్నారు. షర్మిలా ఎవరి బాణం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయలేక ఇక్కడకి వచ్చారన్నారు. పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని ఆయన అన్నారు.